ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలుండగా 49 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. జిల్లా అంతటా కరవు పరిస్థితులు నెలకొన్నా 14 మండలాలను మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. అనంతపురం జిల్లాలో 28, సత్య సాయి జిల్లాలో 21 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు లేకున్నా కొన్ని మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.