బుక్కపట్నం మండల పరిధిలోని మారాల గ్రామ సమీపంలో పేకాట జూదరులపై పోలీసులు దాడి చేసి ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎస్ఐ నరసింహుడు ఆధ్వర్యంలో మండల పరిధిలోని మారాల గ్రామం సమీపంలో పేకాట కేంద్రంపై పోలీసులు దాడి చేసి ఏడు మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 20, 900 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.