సీఎం జగన్ ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారుడు, కుళ్లు రాజకీయాలు నడుస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.