ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కరువుపై ఇప్పటివరకు కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజల ఆవేదనను వినే దిక్కు రాష్ట్రంలో ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారానికి రూ.కోట్లు ఖర్చు పెడతారని, రైతులకు మాత్రం రూపాయి ఇవ్వరంటూ మండిపడ్డారు. పంట నష్టంపై కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చాయని, ఏపీ మాత్రం ఇవ్వలేదని చెప్పారు.