రోగి ఒక యోగి లాగా, స్వాతంత్య్ర సమరయోధుడిలా ఎలా బయటకి వచ్చాడని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కారులో 24 గంటలు ప్రయాణం చేయగలగడం న్యాయస్థానం చెప్పినా పాటించకపోవడం కాదా అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఈ జన్మకు మారడని.. యుద్ధం అనేది 2019లోనే అయిపోయిందన్నారు. క్షతగాత్రులు అయిన టీడీపీ నేతలు ఉంటే.. దత్తపుత్రుడి భుజం మీద చేతులేసి వారిని కూడగట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. యుద్ధానికి అవతల ఎవరున్నారు… లోకేష్‌వి అన్నీ నిద్రలో వచ్చిన కలవరింతలు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ నిజంగానే వారసుడిగా ఉన్నాడా అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు అత్యంత తీవ్రమైన వ్యాధులున్నాయి, ప్రాణాలకే ప్రమాదమని వాదించారని ఆయన తెలిపారు. వాళ్ళ రూట్ మ్యాప్ రాగానే మేం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండున్నర గంటలు సమయం పట్టే ప్రయాణాన్ని 14గంటలు మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్‌లా చేశారన్నారు.