చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రుడి కక్ష్యలోకి వ్యోమనౌక చేరిన విషయం తెలిసిందే. ఈ ప్రాసెస్‌లో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయింది. అయితే ప్రొపల్షన్ మాడ్యుల్ మాత్రం న్యూక్లియర్ టెక్నాలజీని వాడుకొని అవసరమైన శక్తిని పొంది చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతోందని అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి తెలిపారు.