మణిపూర్‌లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైత్రీ తెగ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మైత్రీ లీఫున్ చీఫ్ ప్రమోత్ సింగ్ తన డ్రైవర్‌తో కలిసి ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అదే సమయంలో కారులో వచ్చిన సాయుధుడు వీరిపై కాల్పులు జరిపాడు. అయితే వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.