రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ నెల 25న రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఝలావర్ నియోజకవర్గంలో ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. తన కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ప్రసంగాన్ని విన్న తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.