ధైర్యం ఉంటే పార్వేట మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగా లేదని చెప్పగలరా అంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తేదీ.. సమయం చెబితే.. అర్కాలజీ అధికారులతో కలిసి పార్వేటి మండపం పరిశీలనకు వస్తానన్నారు. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను టీటీడీ కూలతోయ్యకూడదని హితవుపలికారు. టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదన్నారు. పురాతన మండపాలను జీర్ణోద్దారణ చేసే సమయంలో టీటీడీ అర్కాలజీ అధికారులను సంప్రదించాలన్నారు. ఆర్కాలజీ అధికారుల సూచనలు మేరకు టీటీడీ జీర్ణోద్ధారణ పనులు చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.