అడ్డగోలు దోపిడీపై తప్ప కరువు నివారణ చర్యలు చేపట్టాలన్న సోయి లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ వాపోయారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే... వారి సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 100 మండలాల్లో కరువు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. కరువు కోరల్లో చిక్కి రైతాంగం విలవిల్లాడుతున్న ఈ కష్టకాలంలో నిబంధనలను సడలించి అయినా యుద్ధప్రాతిపదికన రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని లోకేష్ పేర్కొన్నారు.