కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు గంగాధర్ 10ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. అయితే వర్షాలు రాక వేరుశెనగ పంట ఎండిపోవడంతో కౌలు రైతు ఆ పంటను గొర్రెలకు వదిలేశారు. రైతు మాట్లాడుతూ రూ. 1, 57, 000లు వెచ్చించి 10 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వేరుశనగ పంట వేస్తే చివరికి అప్పుల పాలు కావడంతో పాటు పంటంతా గొర్రెలకు ఆహారంగా వదిలేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.