పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో విచారణ ఊపొందుకుంది. మొత్తం10 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వేలాది దొంగ ఓట్లు ఉన్నాయంటూ, వాటిని తొలగించాలంటూ ఫారం7 దరఖాస్తులు భారీగా రావడంతో ఈ నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యే ఏలూరి 2019లో గెలిచారని పర్చూరు వైసిపి ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సాక్షాలు బయటపెట్టగా ఏలూరి అదేమీ లేదంటూ కోర్టుకు ఎక్కారు. దీంతో విచారణ షురూ అయింది.