రోడ్డు ప్రమాదంలో ప్రయివేటు ఉపాధ్యాయుని మృతి చెందిన ఘటన తెనాలిలో జరిగింది. చెంచుపేటకు చెందిన పి. రోజా (33) శనివారం తన బంధువు బైకుపై, మూడేళ్ల తన కుమారుడితో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైకు వీరి వాహనాన్ని ఢీకొట్టగా రోజా తన చేతిలోని కుమారుడిని జాగ్రత్తగా పట్టుకునే క్రమంలో రోడ్డు మీదకు పడిపోవటంతో తలకు తీవ్రగాయం అయింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారికి గాయాలు కాలేదు.