ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. PMAY, PM కిసాన్, ఫసల్ బీమా, పోషణ్ అభియాన్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఉజ్వల తదితర పథకాలకు అర్హులైనప్పటికీ లబ్ధి చేకూరని వారిని గుర్తించ్చేందుకు వీలుగా 2.7 లక్షల పంచాయితీలలో 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' చేపడుతోంది. ఈనెల 15న ప్రధాని మోదీ 110 గిరిజన జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.