ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు భారీ నష్టం వాటిల్లింది. బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే క్యూ3 (జూలై-సెప్టెంబర్) గానూ ఫలితాల్ని విడుదల చేసింది.ఈ సందర్భంగా కంపెనీ 12.8 బిలియన్ డాలర్లు (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టపోయినట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు కోల్పోయింది. గత ఏడాది క్యూ3లో 2.8 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఒక్కో షేర్ విలువ రూ.1,907 డాలర్లు పడిపోయిందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.