ఈ రోజుల్లో మనుషుల కంటే పెంపుడు జంతువులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెంపుడు జంతువులున్న వారు దూర ప్రాంతాలకు జర్నీ చేసేటప్పుడు సమస్యలు వస్తుంటాయి. పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లాలంటే ఇబ్బంది తలెత్తుతోంది. జంతు ప్రేమికుల మేరకు కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువులకు కంపార్ట్ మెంట్ ను ఏర్పాట్లు చేయనుంది. ట్రైన్లో జంతువులను ఉంచేందుకు ప్రత్యేకంగా రాక్స్ ఉంటాయి. వీటి దగ్గర ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారని రైల్వే శాఖ తెలిపింది.