ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో బయటకు రావడానికి భయపడుతున్న జనం,,,,,వారం రోజుల నుంచి భారీగా పెరిగిన గాలి కాలుష్యం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 08:26 PM

తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ నగరంలో గాలి విషతుల్యంగా మారిపోయి.. అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకున్నాయి. గతవారం రోజుల నుంచి వాయు నాణ్యత సూచి 400పైగా నమోదవుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూరిత నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు టాప్-10లో ఉన్నాయి. ఆ జాబితాలో ఏఐక్యూ 483తో ఢిల్లీ తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో లాహోర్ (పాకిస్థాన్), కోలకతా (భారత్), ఢాకా (బంగ్లాదేశ్), కరాచీ (పాక్), ముంబయి (ఢిల్లీ), షాంఘై, హౌంగ్జూ (చైనా), కువైట్, వుహాన్ (చైనా) నిలిచాయి.


కోల్‌కతా, ముంబయి ఏక్యూఐ వరుసగా 206, 162గా నమోదయ్యాయి. రెండో స్థానంలో ఉన్న లాహోర్‌లో వాయు నాణ్యత 370గా ఉంది. ఇక, ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితికి అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలివేగం తగ్గడం,హరియాణ, పంజాబ్‌లో వంట వ్యర్థాలను రైతులు తగులబెట్టడమే కారణమని అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతంలో వాయు నాణ్యత సూచి 550 మించిపోగా.. ఢిల్లీ నగరం మొత్తం దుమ్ము పట్టినట్టు మారిపోయింది. దీంతో రెండు కోట్ల జనాభాలో చాలా మందికి కంటి దురద, గొంతు నొప్పి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


వాయు నాణ్యత 0 నుంచి 50 మధ్య ఉంటే స్వచ్ఛమైందిగా పరిగణిస్తారు. కానీ, 400 నుంచి 500 మంది ఉంటే చాలా ప్రమాదమని, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నా చివరి 24 గంటల డ్యూటీలో పిల్లలు దగ్గడం, గొంతునొప్పితో బాధపడటం.. వేగంగా శ్వాస తీసుకోవడం నేను చూశాను’ అని ఢిల్లీకి చెందిన అహ్మద్ ఖాన్ అనే ఓ వైద్యుడు ట్విట్టర్‌లో తెలిపారు. శనివారం ఢిల్లీ సగటు వాయు నాణ్యత సూచిక 415గా ఉంది. శివారులోని నోయిడా, గురుగ్రామ్‌లో కూడా సగటు వాయు నాణ్యత శనివారం దాదాపు ఇలాగే నమోదయ్యింది. నోయిడాలో 408, గురుగ్రామ్‌లో 404గా ఉండగా.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు గాలి కాలుష్యం కాస్త తగ్గింది. కానీ శనివారం రాత్రి నుంచి మళ్లీ పెరిగింది. మరోవైపు, ఈ వాతావరణం వల్ల చిన్నారుల ఎక్కువ ప్రభావితం అవుతారని భావించిన ఢిల్లీ ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలలకు నవంబరు 10 వరకూ సెలవులు ప్రకటించింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అవసరమైతే ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని కేజ్రీవాల్ సర్కారు సూచించిన విషయం తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com