ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో అవినీతిలేని పాలన, పేదరికం లేని కుటుంబాలను తీసుకువస్తానని సీఎం జగన్ ప్రకటించారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ గుర్తు చేసారు. అయన మాట్లాడుతూ..... నాలుగున్నరేళ్లకాలంలో ప్రజల మధ్య ఇచ్చిన మాటకు, మేనిఫెస్టోలో చేసిన ప్రకటనలకు , ప్రమాణ స్వీకారం చేసిన రోజున చెప్పిన మాటలకు కట్టుబడి సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని, ఎంతో దూరదృష్టితో జగన్ పాలన సాగిస్తూ తరతరాల పేదరికాన్ని పారద్రోలడానికి కృషి చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో పేదలు సాయం కోసం చేయి చాపకుండా తలెత్తి ధైర్యంగా బ్రతకగలిగే ఆత్మస్దైర్యాన్ని జగన్ కల్పిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ కు ధీటుగా జగన్ తీర్చిదిద్దుతున్నారని, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్య శ్రీలతో ప్రతీ కుటుంబంలో వెలుగులు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు మామలు ఉన్నారని. ఒకరు చందమామ, మరొకరు జగన్ మామ అని స్కూలు విద్యార్థులు గొప్పగా అభివర్ణించుకుంటున్నారని గుర్తు చేసారు.