ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెత్తందారి వర్గాలకు ధీటుగా సామాజిక సాదికారతను అందిస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2023, 12:08 PM

ప్రతీ కుటుంబంలో సంస్కారవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఇచ్చేది చదువు మాత్రమేనని జగన్ భావిస్తుంటారని,పేదవాడు విజయపతాకం ఎగురవేయాలన్నదే జగన్ సంకల్పమని  తమ్మినేని సీతారామ్ ఉద్ఘాటించారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేయకుండా జగన్ ను మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ను మళ్లీ సీఎం చేసుకోకపోతే దేవుడు కూడా  క్షమించడు అన్న విషయాన్ని గుర్తించాలని, పెత్తందారి వర్గాలకు ధీటుగా సామాజిక సాదికారతను సీఎం జగన్ తీసుకువెళ్తున్నారన్నారు.  శ్రీకాకుళం జిల్లా అబివృద్ధిపైనా, సంక్షేమంపైన తెలుగు దేశం పార్టీ నేతలు దమ్ముంటే చర్చకు రావాలని సీతారామ్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వైయస్సార్ సిపి శ్రేణులు సమరోత్సాహంతో ముందడుగు వేస్తున్నాయంటే జగన్ చేసిన సంక్షేమ పథకాల అమలే కారణమన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com