విజయవాడలో బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. 'బస్సు ప్రమాదం దురదృష్టకరం. ప్రమాదానికి రెండు వాదనలు వినిపిస్తున్నాయి.. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి కారణం తెలుసుకుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తాము. గాయపడిన వారికి ఆసుపత్రి ఖర్చులు భరిస్తాం' అని తెలిపారు.