ఉమ్మడి అనంత జిల్లా ముందెప్పుడూ లేని దుర్భిక్షంలో ఉందని, హంద్రీనీవాలో నిలువ చేయాల్సిన నీటిని పుంగనూరుకు తరలిస్తున్నారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంత జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్‌లో తాగునీటి కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. ‘‘ఉమ్మడి అనంత జిల్లా ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?.. మీకెందుకు ఆ పదవులు. మీరంతా దద్దమ్మలు... చేతకాని వారు’’ అంటూ విరుచుకుపడ్డారు. తక్షణం జిల్లాకు తాగునీటిని విడుదల చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు బాధ్యత లేదా... కృష్ణ జలాలను తరలించడం వెంటనే ఆపాలి అని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.