వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా సుమారు 1300 మంది దళితులపై దాడులు చేసిందని, వీటిని ఆపాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష డిమాండ్ చేశారు. లొహరిబంద గ్రామంలో ఆదివారం దళితులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దళితులపై దాడులను ఖండించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు భావన దుర్యోధన, దాసరి తాతారావు, నవీన్‌కుమార్, లబ్బ రుద్రయ్య, బి.కోదండ రావు, మోహనరావు, చౌదరి మురళీకృష్ణ, కె.వెంకట్రావు పాల్గొన్నారు.