ఈనెల 7న సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తికి వస్తున్నందున ఆయన్ను కలిసే అవకాశాన్ని ఇవ్వాలని జిల్లా ఏఐఎస్ఐ, పిడిఎస్ యూ నాయకులు పోతలయ్య, నిరంజన్ అధికారులకు సోమవారం ధర్మవరంలో విన్నవించారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రిని కలిసి వివరించాలని, అందువలన ముఖ్యమంత్రిని కలిసే ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే సభ ప్రాంగణంలోకి దూసుకెళ్తామని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరించారు.