అనంతపురం జిల్లాలో టీడీపీ కరవు స్టీరింగ్ బృందం పర్యటనలో భాగంగా కుడేరు మండలంలో వేరుశనగ పొలాలను, దెబ్బతిన్న పంటలను టీడీపీ బృందంతో పాటు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి సోమవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ జిల్లాలో వేరుశనగ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు వేల కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చిందన్నారు. వైసీపీ కేవలం తూతూ మంత్రంగా మాత్రమే ఇచ్చిందన్నారు.