ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే టీడీపీ కోవర్టు అంటారా అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. ఆమె పుట్టపర్తిలో మాట్లాడుతూ..'రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా? అలాచేస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని, పాలన కొనసాగిస్తోందని ఫైర్ అయ్యారు. కాగా జనసేనతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు.