వృద్ధాప్యంలో నెలనెలా పెన్షన్ వంటి ఆదాయం పొందేందుకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ ఉపయోగపడుతుంది. స్కీమ్ కాలపరిమితి ఐదేళ్లు. దీనిపై ఏడాదికి ప్రస్తుతం వడ్డీ రేటు 7.50% ఉంది. ఒక్కో వ్యక్తి ఈ స్కీమ్‌లో అత్యధికంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇద్దరు కలిసి తీసుకున్న జాయింట్ అకౌంట్లకు రూ.15 లక్షల వరకు పరిమితి ఉంది. రూ.9 లక్షల పెట్టుబడికి నెలకు రూ.5 వేల చొప్పున పొందొచ్చు.