ఉద్యోగులకు పి ఎఫ్ రుణాలు ఇవ్వడం లో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని మంగళవారం అనంతపురంలో ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం పి ఎఫ్ రుణాలకు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్న కూడా మంజూరు చేయక పోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగుల పి ఎఫ్ ఖాతాలలో డబ్బు నిల్వ చూపించడం లేదని, డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు.