నీట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న సంతకాల ఉద్యమంలో పార్టీ అధినేత తిరుమావళవన్, ఇతర పార్టీల నేతలు సోమవారం ఉదయం అశోక్‌నగర్‌లోని డీపీఐ కార్యాలయానికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయనిధి మీడియాతో మాట్లాడారు. నీట్‌కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాల సేకరణ ఉద్యమం జరిగిందన్నారు. 10 లక్షల సంతకాలు సేకరించినట్లు తెలిపారు. సనాతన ధర్మాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి ఉదయనిధి అన్నారు.