HPCL సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో బ్యాటరీ ఎక్స్ఛేంజ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం బ్యాటరీ ఎక్స్ఛేంజ్ కంపెనీ గొగారోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 21 వేల హెచ్పీసీఎల్ రిటైల్ అవుట్లెట్లలో బ్యాటరీ మార్పిడి సౌకర్యాలు కల్పించనున్నారు. ద్విచక్ర వాహనాల కోసం 1,000 బ్యాటరీ ఎక్స్ఛేంజ్ స్టేషన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.