బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. తిరుమలలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనం క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది.