రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకం దారులు తప్పనిసరిగా పోలీసు అనుమతులు తీసుకోవాలని పొన్నూరు రూరల్ సీఐ మీసాల రాంబాబు అన్నారు. మంగళవారం స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ప్రకారం గోడౌన్ నిల్వలు , అమ్మకం దారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పొన్నూరు రూరల్, చేబ్రోలు పరిసర ప్రాంత అమ్మకం దారులకు ఆయన సూచించారు.