భారతదేశ టెక్ దిగ్గజం విప్రో మరోసారి ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తమ కంపెనీలో పనిచేసే ఐటీ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలి. నవంబర్ 15 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ తమ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపినట్లు తెలిపింది. కొత్తగా అమలయ్యే వర్క్ పాలసీలను అనుసరించకపోతే జనవరి 7, 2024 నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విప్రో తన ఉద్యోగులను హెచ్చరించింది.