బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ మొహమ్మద్ ఫజులుల్లా జైలు శిక్ష విధించారు. పామర్రు మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన బాలిక కళాశాలకు వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన కుందేటి మరియదాసు వేధింపులకు గురిచేశాడు. 2017 పామర్రు పోలీస్టేషన్లో కేసు నమోదు కాగా, కోర్టులో నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్ష, రూ. 1300 జరిమానాను మంగళవారం న్యాయమూర్తి విధించారు.