పెళ్లి చేసుకోబోయే జంటలకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. నూతన జంటలు పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు. శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదంను పోస్టులో పంపిస్తామని టీటీడీ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ.ఓ ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కే.టి రోడ్, తిరుపతి 517501' పేరిట పెళ్ళికి నెల రోజుల ముందుగా పత్రికను పంపాలి.