రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీన మంగళవారం పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి జిల్లాలోని పుట్టపర్తి పర్యటనలో భాగంగా విమానాశ్రయం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి.