ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే కాదు, ప్రతిపేదవాడికీ మేలు చేయాలని తపిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. అయన మాట్లాడుతూ.... ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. లబ్ధిదారులకు పథకాల ఫలితాలు నేరుగా అందేలా చూస్తున్నారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసింది. సామాజిక న్యాయమంటే నినాదం కాదు విధానమని చాటి చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. తన మొదటి కేబినెట్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14మందికి స్థానం కల్పించారు సీఎం జగన్. అంటే దాదాపు 56శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చారన్నమాట.తర్వాతి విస్తరణలో మరింతమందికి అవకాశం కల్పించారు. నలుగురు డిప్యూటీ సీఎంలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని నియమించారు. సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.