స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో యూ-14 విభాగంలో రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైన వారికి ప్రభుత్వం అందజేసిన క్రీడా దుస్తులను తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారాకనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా సెక్రటరీ వసంత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.