టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పిటిషన్పై విచారణ ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులిచ్చారన్న ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర పిటిషన్ వేశారు.