ప్రపంచంలోనే తొలిసారి సరికొత్త శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి కంటిని పూర్తిగా మార్చారు వైద్యులు. న్యూయార్క్‌లోని లాంగోన్‌హెల్త్ హాస్పిటల్ వైద్యులు ఓ ప్రమాదంలో కంటిని కోల్పోయిన వ్యక్తికి రెప్పతో పాటు కంటిని మార్చాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే మే నెలలో శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం కన్ను ఆరోగ్యంగానే ఉందని వైద్యులు గురువారం ప్రకటన చేశారు. కంటిపై స్పర్శ తెలుస్తోందని పేషెంట్ ఆరన్ జేమ్స్ తెలిపారు.