సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... సామాజిక సాధికారయాత్ర.. రెండువారాల నుంచి రాష్ట్రంలో మార్మోగిపోతున్న నినాదం. సాధికార సభలకు జనం పోటెత్తుతున్నారు.సామాజిక అసమానతలతో బడుగు బలహీన వర్గాలు ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టనష్టాలు చూశారు. ఆధిపత్యకులాల కింద అణగారిపోతున్న వర్గాలను ఆదుకునే మనసున్న మారాజు లేని రోజులవి. అదృష్టవశాత్తూ ఈనాడు మనకు ఓ మంచి నాయకుడు వచ్చాడు. గతంలో బాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు మెల్లమెల్లగా కుదేలైపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రులు క్షీణించిపోయాయి. ఆ పాలనలో అన్నీ దరిద్రాలే. మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలకు అవసరమైనవన్నీ తీసేస్తూ...కార్పొరేట్లకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. పేదవాడిని. పేదవాడిగా చూసిన బాబు హయాంలో, వెనుకబడిన వర్గాలకు జరిగిన మంచి అంటూ ఏమీ లేదు. ఈనాడు పరిస్థితులు ఎంతో మంచిగా మారిపోయాయి. మన పిల్లలు దర్జాగా చదువుకుంటున్నారు. పెద్ద చదువులే బీద కుటుంబాల తలరాతలు మారుస్తాయని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్యరంగంలో ఎన్నెన్నో గొప్ప పనులు చేసి చూపారు. 17 కొత్తమెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదే.పేదలకు సంబంధించిన రేషన్‌కార్డు, ఇళ్లు, పెన్షన్లు కావాలంటే ...నాడు జన్మభూమి కమిటీల దయ మీద ఆధారపడాల్సివచ్చేది. కానీ జగనన్న పాలనలో పేదల ముంగిళ్లకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. పేదవాళ్లు ఈరోజు తమ కాళ్లమీద తాము నిలబడగలుగుతున్నారంటే..అది జగనన్న సామాజిక సాధికారత ఫలితమే. గతంలో మత్స్యకారుల్ని అవమానించి పంపినవారు చంద్రబాబు. మరి ఈనాడు జగన్‌మోహన్‌రెడ్డి ఆ మత్స్యకార సోదరుల్లో ఒకరిని రాజ్యసభకు పంపారు. మరొకరిని పక్కన కూర్చోపెట్టుకుంటున్నారు. సువిశాల తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక హార్బర్‌గానీ, ఒక పోర్ట్‌గానీ ప్రారంభించలేని చరిత్రహీనుడు చంద్రబాబు. రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే ఆదాయవనరైన ఈ తీరప్రాంత సంపదను గుర్తించి, అభివృద్ధి చేస్తున్న సమర్థత జగన్‌మోహన్‌రెడ్డిది. ఒకనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఎవరైనా ఎస్సీ, ఎస్టీలలో పుట్టాలని కోరుకుంటారా? అని మాట్లాడిన చంద్రబాబు దుర్మార్గాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa