రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం ఏలూరు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నిటిని దారి మళ్లించారు. విజయవాడ సమీపంలోని విజయవాడకు, రామవరప్పాడుకు మధ్యలో రైళ్ళ రాకపోకలు పూర్తిగా రద్దు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్ళే రైళ్ళను దారి మళ్లించినట్లు తెలిపారు. ఈనెల 13, 14,15, 17, 18 తేదీలలో.. విజయవాడ –విశాఖపట్టణం,(22702) విశాఖ–విజయవాడ(22701) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు –విశాఖపట్టణం(17239) ఈనెల 13 నుంచి 19 వరకూ.. విశాఖపట్టణం –గుంటూరు(17240) 14 నుంచి 20 వరకూ రద్దు చేశారు. గుంటూరు–రాయగడ (17243) ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకూ, రాయగడ –గుంటూరు(17244) ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీవరకూ రద్దు చేశారు. నర్సాపురం–విజయవాడ (07863), విజయవాడ – నర్సపూర్ (07861) రైళ్లను ఈనెల 13 నుంచి 19 వరకూ విజయవాడ రామవరప్పాడు మధ్యలో రద్దు చేశారు అధికారులు.
ఈ నెల 13–19 వరకు కాకినాడ టౌన్–విశాఖ (17267/17268), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07576), విజయవాడ–గూడూరు (07500/07458), బిట్రగుంట–విజయవాడ (07977/07978), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17219),గుంటూరు–విశాఖ (17239), 14–20 వరకు విశాఖ–మచిలీపట్నం (17220), 13, 14, 15, 17, 18 తేదీల్లో విజయవాడ–విశాఖ (22702/22701), ఈ నెల 13–17 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) రైళ్లు రద్దు చేశారు. పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13–19 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ–రాయనపాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు (12756) వెళ్ళే రైలును 18వ తేదీన విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ నిడదవోలు మీదుగా నడుపుతారు. బెంగుళూరు నుంచి గౌహతి(12509) ఈనెల 15, 17 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా నడుపు తారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్–భువనేశ్వర్ ((11019) రైలు ఈనెల 13, 15, 17, 18 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా వెళ్తుంది. ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో ఈ రైళ్లను ఆయా తేదీలలో రద్దు చేశారు. ఎర్నాకుళం జంక్షన్–పాట్నా (22643) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13న విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా వెళ్తుంది. ప్రయాణికులకు ఈ మార్పుల్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.