నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటావని మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు నిలదీశారు. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం కలచివేసిందన్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఏం ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని అడిగారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు. యేటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తానన్నారని.. ఒక్క జాబ్ కేలండర్ అయినా విడుదల చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పత్రికకు ప్రకటనలు, తన విలాసాలకు మాత్రమే జగన్ రెడ్డి కేలండర్ రూపొందించుకున్నారన్నారు. సలహాదారులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదన్నారు. సైకో ప్రభుత్వానికి పంపేందుకు యువత సిద్ధంగా ఉందని మంతెన సత్యనారాయణ వెల్లడించారు.