ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి స్విమ్స్‌లో గ్యాస్ర్టోఎంట్రాలజి సేవలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 13, 2023, 12:50 PM

రోగుల సౌకర్యార్థం తిరుపతి స్విమ్స్‌లో ఈ నెల 14 నుంచి గ్యాస్ర్టోఎంట్రాలజి ఓపీ సేవలను పునప్రారంభిస్తున్నట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్స్‌ ఆవరణలోని పద్మావతి ఓపీడీ బ్లాక్‌లోని 41, 42 గదుల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa