ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022-2023 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను (2023-24) విద్యా సంవత్సరంలో తిరిగి కాలేజీలలో చేర్పించేందుకు ఏపీ ప్రభుత్వం వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కృషి చేస్తుంది. దీని ఫలితంగా 76, 603 మంది విద్యార్థులు తిరిగి కాలేజీలలో చేరారు. గత సంవత్సరం నుండే ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు మధ్యలో చదువు ఆపకుండా తిరిగి కాలేజీలలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.