పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో ఈ నెల 15వ తేదీన టిడ్కో గృహాల సముదాయంలో 'పాలకొల్లు చూడు' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... ప్రభుత్వం, మాకు పోటీ సమావేశం పెట్టాలని చూడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇక భయపడేది లేదని వేలాది మంది ప్రజలతో రేపు సభ నిర్వహిస్తామని అన్నారు. లబ్దిదారులు సొంత ఇంటికి చేరకముందే వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టి వారిని రుణగ్రస్తులను చేశారని తెలిపారు.