కార్తీక మాసం ప్రారంభం కావడంతో కృష్ణ ఘాట్ వద్ద భక్తులు నదీ స్నానాన్ని చేస్తున్నారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కృష్ణా ఘాట్ మారుమోగుతోంది. కృష్ణానదిలో కార్తీకదీపాలను మహిళలు వదులుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో శైవక్షేత్రాలు నిండిపోయాయి. తమ సౌభాగ్యం కోసం, వారి భర్తల యోగక్షేమాల కోసం, మోక్షం పొందేందుకు కార్తీక మాసం నెల రోజుల పాటు విశేషమైన పూజలు చేస్తున్నారు.