నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లి, సదుం, సోమల, పులిచెర్ల , రొంపిచర్ల మండలాల లోని పాఠశాలలలో మంగళవారం బాలల దినోత్సవం వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నెహ్రూ జీవిత విశేషాలను వివరించారు. ప్రతి విద్యార్థి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa