ఐదేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి.. హత్యచేసిన కామాంధుడికి మరణ శిక్ష విధించింది. అలువా చిన్నారి హత్య కేసులో మంగళవారం తీర్పును వెల్లడించిన ఎర్నాకులం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు.. దోషికి పోక్సో చట్టం, ఐపీసీలోని ఐదు సెక్షన్ల కింద మిగతా జీవితకాలానికి అదనంగా ఐదు జీవిత ఖైదులను కూడా చెప్పింది. తీర్పు చెప్పే ముందు దోషిని ఉదయం 11 గంటలకు కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి శిక్షను చదువుతుంటే.. ఒక అనువాదకుడు అతడికి వివరించాడు. కాగా, గత జులై 28న అలువాలో ఐదేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసిన అసఫక్ ఆలమ్ (29).. అత్యాచారం చేసి చంపేశాడు. నేరం జరిగి 100 రోజుల్లో విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. నవంబర్ 4న దోషిగా నిర్ధారించింది. తాజాగా, న్యాయమూర్తి కే సోమన్ శిక్షను ఖరారు చేశారు.
ఇది అరుదైన నేరమని పేర్కొంటూ దోషికి గరిష్టంగా శిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. నవంబర్ 9న శిక్షపై విచారణ చేపట్టగా.. నిందితుడికి 29 ఏళ్లని, అతడి చిన్న వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని డిఫెన్స్ న్యాయవాది ఉపశమనం కోరారు. దీనిని నిరాకరించిన న్యాయమూర్తి.. దోషిగా మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాలల దినోత్సవం రోజేను కోర్టు తీర్పు చెప్పడం ఆసక్తికర విషయం. ముక్కుపచ్చలారని చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి కర్కశంగా గొంతుకోసి హతమార్చిన ఉదంతం అందరి హృదయాలను కలచివేసింది. ఇక, బాలికను కాపాడలేకపోయిన పోలీసులు.. చిన్నారికి క్షమాపణలు చెప్పారు. చిన్నారిని తల్లిదండ్రులతో కలపలేక పోయినందుకు చింతిస్తున్నామని, 'క్షమాపణలు తల్లి' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోలీసులు పెట్టిన పోస్టు అప్పట్లో వైరల్ అయ్యింది.
బిహార్ నుంచి కేరళకు వలస వచ్చిన బాధిత చిన్నారి కుటుంబం అలువాలో ఉపాధి చేస్తూ జీవనం సాగిస్తోంది. జులై 28న చిన్నారి ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న అస్ఫాక్ ఆలాం అనే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి.. ఏడవకుండా ఉండేందుకు చాక్లెట్ కొనిచ్చాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్తుండగా అనుమానం వచ్చిన ఓ స్థానికుడు ఎవరని అడిగితే.. తన కూతురు అని అస్ఫాక్ అబద్దం చెప్పాడు. పాప కిడ్నాప్ అయినట్లు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సీసీటీవీ ఆధారంగా రాత్రి 9.30 గంటలకు అస్‌ఫాక్‌ను పోలీసులు పట్టుకుని విచారించడంతో బాలికను చంపినట్టు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa