దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏపీలో భూ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023ను ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది. దాని గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఇటీవల ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు.