ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో టైప్ 2 డయాబెటిస్ ఒకటి. ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, జన్యు కారణాలు ఇందుకు దారి తీస్తున్నాయి. కాగా ధూమపానానికి స్వస్తి పలకడం ద్వారా ఈ వ్యాధి ముప్పును 30-40శాతం తగ్గించుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య పేర్కొంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ధూమపానం ప్రభావితం చేస్తుందని నిరూపితమైనట్లు తెలిపింది.